
‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి’
బాన్సువాడ రూరల్ : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే వి ధంగా పోలీస్ సేవలు ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం ఆయన బాన్సువా డ, బీర్కూర్ పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులతోపాటు పలు విభాగాలను పరిశీలించారు. రో జూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా పనిచేయాలని సి బ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత కు ప్రాధాన్య ఇవ్వాలన్నారు. డయల్ 100 కాల్స్‌కు బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలపై రోడ్డు భ ద్రత నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. గ్రామ పోలీసు అ ధికారి తరచూ తమ గ్రామాలను సందర్శించి ప్రజ లను చైతన్య పర్చాలన్నారు. ఏవైనా సమస్యలుంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.