
ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే!
● ముగిసిన గడువు
● 30 శాతం కూడా స్పందించని
దరఖాస్తుదారులు
కామారెడ్డి టౌన్ : అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణకోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా దరఖాస్తుదారులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు బల్దియాల పరిధిలో 20,500 దరఖాస్తులు రాగా.. 5,166 మంది మాత్రమే స్పందించారు.
ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాలోని మూడు ము న్సిపాలిటీలకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం 20,500 దరఖాస్తులు వచ్చాయి. ఆ భూములను క్ర మబద్ధీకరించడం కోసం ప్రభుత్వం మార్చిలో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ గడువు మార్చి నెలాఖరు తో ముగిసినా దరఖాస్తుదారులు పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రభుత్వం గడువును రెండోసారి పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చినా ఫలి తం లేకపోయింది. చివరిసారిగా ఈనెల 3వ తేదీ వరకు గడువును పొడిగించినా నామమాత్రపు స్పందనే వచ్చింది. గడువు ముగిసే నాటికి 5,166 మంది ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించారు. ఇందులో 1,755 దరఖాస్తులను పరిష్కరించి క్రమబద్ధీకరిస్తూ ప్రొసిడింగ్ పత్రాలను అందజేశారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా మూడు బల్దియాలకు కలిపి రూ. 12.16 కోట్ల ఆదా యం మాత్రమే సమకూరింది.
క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం
దరఖాస్తుదారులందరికి ఫోన్‌ల ద్వారా సమాచారం ఇచ్చాం. అయినా ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. గడువులోపు ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, పరిష్కరిస్తున్నాం.
–గిరిధర్, టీపీవో, కామారెడ్డి
347
5,166
4,580
ఫీజు చెల్లించినవారు
239
10.88
కోట్లు
ఆదాయం
(రూ.లలో)
38
లక్షలు
90
లక్షలు
12.16
కోట్లు
స్పందన ఎందుకు లేదంటే..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ అవకాశం ఇచ్చినా దరఖాస్తుదారులు ఎందుకు స్పందించడం లేదోన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది ఆ ఫ్లాట్లను ఇతరులకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు విస్తీర్ణం తక్కువగా ఉన్న ప్లాట్లలో ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా నిర్మాణాలు చేసుకున్నారు. మరికొంత మంది ఆర్థిక సమస్యలతో ఫీజు కట్టడానికి ముందుకు రాలేకపోయారు. ఇంకొందరు ఫ్లాట్లలో ఇల్లు కుట్టుకునే ఉద్దేశం లేదని, వాటిని ఎప్పటికై నా ఇతరులకు విక్రయించేదే కదా అన్న ఉద్దేశంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు ముందుకు రాలేదని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ దందాలో స్తబ్ధత నెలకొనడంతోనూ ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆశించిన స్పందన లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే!