
పాసుపుస్తకాలు, సర్వే నంబర్ల మిస్సింగ్..
రెవెన్యూ గ్రామాలవారీగా దరఖాస్తుల వివరాలు..
దరఖాస్తుపై విచారణ నిమిత్తం కన్నాపూర్‌లో పర్యటిస్తున్న
కలెక్టర్ సంగ్వాన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అధికారులు (ఫైల్)
రెవెన్యూ దరఖాస్తులు
గ్రామం
శెట్పల్లి సంగారెడ్డి 914
పోతాయిపల్లి 453
లింగంపల్లి కుర్దు 337
ముంబోజీపేట్ 309
భవానీపేట్ 232
లింగంపేట్ 200
పర్మల్ల 187
పోల్కంపేట్ 183
మోతె 173
బాణాపూర్ 128
కొండాపూర్ 125
కన్నాపూర్ 106
శెట్పల్లి 103
నల్లమడుగు 99
బాయంపల్లి 96
రాంపూర్ 95
కోర్పోల్ 90
ఎల్లారం 86
మెంగారం 84
బోనాల్ 75
కంచుమల్ 72
నాగారం 60
జల్దిపల్లి 18
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతి చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అందులో లింగంపేట మండలం ఒకటి. భూ భారతిని ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో భాగంగా గతనెల 17 నుంచి 30 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించారు. ఆయా సదస్సుల్లో భూ సమస్యలపై రెతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో వందలాది దరఖాస్తులు వచ్చాయి. లింగంపేట మండలంలోని 23 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కలిపి మొత్తం 4,255 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ‘సాక్షి’కి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు వారికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు 367 దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిగిందన్నారు.
అత్యధికంగా శెట్పల్లి సంగారెడ్డిలో..
భూ భారతి సదస్సులకు భారీ స్పందన లభించింది. కొన్ని గ్రామాల్లో వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శెట్పల్లి సంగారెడ్డిలో 914 దరఖాస్తులు రాగా అత్యల్పంగా జల్దిపల్లిలో 18 దరఖాస్తులు వచ్చాయని అఽధికారులు తెలిపారు. పోతాయిపల్లిలో 453 దరఖాస్తులు, లింగంపల్లి కుర్దులో 337, ముంబోజీపేటలో 309, భవానీపేటలో 232, లింగంపేటలో 2 వందల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. .
వేగంగా విచారణ...
పైలట్ మండలంలో భూ సమస్యలను పరిష్కరించడంపై అధికారులు ఫోకస్ చేశారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన వెంటనే రెవెన్యూ గ్రామాల వారీ గా రైతులు ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తు న్నారు. ఆయా సమస్యలపై క్షేత్ర స్థాయిలో దరఖాస్తుదారులను పిలిపించి వారి సమక్షంలో విచారణ చేపడుతున్నారు. సదస్సులు పూర్తయిన తర్వాత 367 దరఖాస్తులకు సంబంధించి విచారణ జరిగింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామాలకు వెళ్లి విచారణ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు స లహాలు ఇస్తూ విచారణ వేగంగా పూర్తయ్యేలా చూ డాలని ఆదేశిస్తున్నారు.
భూ భారతి పైలట్ ప్రాజెక్టు
మండలంలో 23 సదస్సులు
రైతుల నుంచి 4,225 దరఖాస్తులు..
సమస్యల పరిష్కారంపై
అధికారుల దృష్టి
క్షేత్ర స్థాయిలో మొదలైన విచారణ
ఇప్పటివరకు 367 సమస్యల
పరిశీలన
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 45 శాతం పాసుపుస్తకాలు రాలేదని, డిజిటల్ సంతకాలు లేవని, సర్వే నంబర్లు మిస్ అయ్యాయని, భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, మ్యుటేషన్ అమలు కాలేదన్న సమస్యలపైనే ఉన్నాయి. 25 శాతం అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలపై వచ్చాయి. 15 శాతం రెవెన్యూ, అటవీ వివాదాలకు సంబంధించినవి కాగా.. పది శాతం సాదా బైనామాలు, ఐదు శాతం అసైన్డ్ భూముల క్రయవిక్రయాలకు సంబంధించినవి.