
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఖలీల్‌వాడి: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయిచైతన్న అన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో ఉండటంతో తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, తమ ఆరోగ్యంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఆదివారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి సౌజన్యంతో‘ ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. పోలీసులు ఉచిత కంటి పరీక్షలు సద్వినియోగం చేసుకువాలని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒక్కసారి కంటి పరీక్షలు తప్పనిసరిగ్గా చేయించుకోవాలన్నారు. అనంతరం వైద్యులు 450 మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రొబేషనర్ ఐపీఎస్ సాయికిరణ్, అదనపు డీసీపీ(ఏఆర్) రామచందర్ రావు, ఏసీపీలు శ్రీనివాస్, మస్తాన్ అలీ, రిజర్వు సీఐ శేఖర్‌బాబు, సతీష్, సరళ తదితరులు పాల్గొన్నారు.