
దశాబ్దాల తర్వాత ఒక్కచోటికి..
చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. – సాక్షి నెట్‌వర్క్
పలు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు
ఆత్మీయ పలకరింపులతో
భావోద్వేగానికి గురైన మిత్రులు

దశాబ్దాల తర్వాత ఒక్కచోటికి..