
ఇంటర్‌లో తెలుగును తప్పనిసరి చేయాలి
కామారెడ్డి అర్బన్: కవులు, రచయితలు మనుషులను మానవీయం చేయడానికి కృషి చేయాలని తెలంగాణ రచయితల సంఘం (తెరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ అన్నారు. తెరసం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విజన్ కళాశాలలో కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు రుద్రంగి రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా శంకర్ హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి మృతులకు సంతాపం ప్రకటించి మౌనంతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇంటర్‌లో తెలుగును తప్పని సరిచేయాలని తీర్మాణించారు. అనంతరం శంకర్ మాట్లాడుతు.. తెరసం తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో పనిచేస్తుందని, కొత్త తరం రచయితలను ప్రోత్సాహించాలన్నారు. బాన్సువాడకు చెందిన కవి నారాయణభట్టుపై మరిన్ని రచనలు రావాలన్నారు. సమవేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్పని సత్యనారాయణ, ప్రతినిధులు పి.కై లాస్, వడ్ల రమేష్, శ్రీనివాస్, వెంకన్న, ఓరం సంతోష్, మారుతి, అశోక్‌కుమార్, సిహెచ్ ప్రకాష్, సిరిగాద శంకర్, పూర్ణచందర్‌రావు, తగిరంచ నరసింహరెడ్డి, బి.చలపతి తదితరులు పాల్గొన్నారు.