
రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి
భిక్కనూరు: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల మానిటరింగ్ అధికారి సురేందర్ సూచించారు. శుక్రవారం ఆయన పెద్దమల్లారెడ్డి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. కాంటాలు జరిగిన వెంటనే రైసుమిల్లులకు ధాన్యంను పంపించి ట్యాబ్ ఏంట్రీ వెంటవెంటనే చేయాలన్నారు. సీఈవో మోహన్‌గౌడ్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని నర్వలో కొనుగోలు కేంద్రం వద్ద సన్నరకాల ధాన్యాన్ని శుక్రవారం మండల వ్యవసాయశాఖ అధికారిణి నవ్య పరిశీలించారు. యంత్రం ద్వారా సన్నరకాల వరిధాన్యానికి కొలతలు తీశారు. నిబంధనల ప్రకారంగా ధాన్యాన్ని ఆరబెట్టి, తాలులేకుండా, నూకశాతం తగ్గకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయశాఖ ఏఈవో మధుసూదన్, సెంటర్ ఇన్‌చార్జీలు రాజేందర్, రాజు, రైతులు ఉన్నారు.