
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి
రాజంపేట: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. శుక్రవారం శివాయిపల్లి గ్రామంలోని వినాయక యూత్ అసోసియేషన్, మాల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి మరువలేనిదని, ప్రపంచ దేశాలకు అంబేడ్కర్ మార్గదర్శిగా నిలిచాడని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహ దాతలు బక్కి నవీన్, బక్కి ప్రశాంత్, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు కంకణాల బాల్‌నర్స్, మెపాల్, కంకణాల రవీందర్, ప్రభాకర్, సిద్ధ రాములు, రమేష్, ఉదయ్, మాజీ ఉపసర్పంచ్ సంధ్య బాలరాజ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.