
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
తాడ్వాయి(ఎల్లారెడ్డి): నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని చిట్యాల గ్రామంలో రూ.2.11 కోట్లతో 33–11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈసబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినట్లయితే మండలంలోని చిట్యాల, సంతాయిపేట్, సోమరం, సోమారం తండాతో పాటు అన్నారం గ్రామానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని దీంతో 22వ ప్యాకేజీ కింద రూ.23కోట్ల నిధులను మంజూరు చేయించాన్నారు. అన్ని గ్రామాలలో రూ. 25కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలను నిర్మించమన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చిట్యాల– సంతాయిపేట్ రూట్లతో ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచేలా కృషిచేస్తానన్నారు. ఎరువులను నిల్వ చేసేందుకు చిట్యాలలో గోదాంను మంజూర్ చేయిస్తానన్నారు.అంతకు ముందు మండల కేంద్రం నుంచి చిట్యాల వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఈ శ్రావణ్, డీఈలు కల్యాణ్ చక్రవర్తి, నాగరాజు, ఏడీఈ కిరణ్ చైతన్య, ఏఈ కరుణాకర్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు శివాజీ, మహేందర్‌రెడ్డి, లక్ష్మణచారీ, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకస్థాపన