‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’

Apr 5 2025 12:49 AM | Updated on Apr 5 2025 12:49 AM

‘ఎల్‌

‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’

గాంధారి : ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు క లెక్టర్‌ చందర్‌ నాయక్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన గాంధారి మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ కాల్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో రాయితీ ఇచ్చే గడువును ప్రభుత్వం పొడిగించిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అ ధికారులకు సూచించారు. అనంతరం బ్రా హ్మణపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరి శీలించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యా హ్న భోజనాన్ని, అనంతరం రేషన్‌ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వ ర్‌, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ ప్రదీప్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి అర్బన్‌: గ్రామ పరిపాలన అధికారుల నియామకం కోసం అర్హులైన మాజీ వీ ఆర్‌వో, వీఆర్‌ఏలు ఈనెల 16వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థు లు గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తు చేసి, దా ని ప్రతిని కలెక్టరేట్‌లో అందజేయాలని సూ చించారు.

సెట్విన్‌లో శిక్షణకు..

కామారెడ్డి అర్బన్‌ : సెట్విన్‌లో వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణకోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కామారెడ్డి సెంటర్‌ సమన్వయకర్త సయ్యద్‌ మోయిజుద్దీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డీసీఏ, పీజీడీసీఏ, టాలీ, ఫొటోషాప్‌, జావా, టైలరింగ్‌, ఫ్యాష న్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వర్క్‌, మెహందీ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 73861 80456, 79891 59121 నంబర్‌లలో సంప్రదించాల ని సూచించారు.

పంటల పరిశీలన

బిచ్కుంద: మండలంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ పర్యటించారు. వాజిద్‌నగర్‌, పుల్కల్‌, గుండెనెమ్లిలలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అన్ని మండలాల వ్యవసాయ అధికారులను ఆదేశించామన్నారు. గుండెనెమ్లిలో 50 ఎకరాలు, బండరెంజల్‌లో 65, వాజిద్‌నగర్‌లో 150, సీతారాంపల్లిలో 30, మానేపూర్‌లో 150, పుల్కల్‌లో 135, పెద్దదేవాడలో 40ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించామని, పూర్తి వి వరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

‘చిన్నారులపై

దృష్టి సారించాలి’

నిజాంసాగర్‌ : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ద చూ పాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అ ధికారి ప్రమీల సూచించారు. శుక్రవారం ఆ రేడ్‌, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో చిన్నారుల బరువులు, ఎత్తులకు సంబంధించిన రికార్డుల నిర్వహణను గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలతో పాటు చి న్నారులకు సక్రమంగా అందించాలని సూ చించారు. ఆమె వెంట ఈజీఎస్‌ ఏపీవో శివకుమార్‌, పంచాయతీ కార్యదర్శులు అంజ య్య, తుకారాం, అంగన్‌వాడీ టీచర్లు ప్రమీ ల, విజయలక్ష్మి తదితరులున్నారు.

‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’ 
1
1/2

‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’

‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’ 
2
2/2

‘ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement