రసవత్తరంగా కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా కుస్తీ పోటీలు

Mar 28 2025 1:03 AM | Updated on Mar 28 2025 1:02 AM

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బోనాల్‌ గ్రామంలోని ప్రభుస్వామి ఆలయం వద్ద గురువారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి రెండు తులాల వెండి కడెం వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన కుస్తీ వీరులకు నగదు బహుమతులు అందజేశారు. చివరి కుస్తీ 2 తులాల వెండి కడెం గెలుపొందిన విజేతకు బహుకరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయకమిటీ సభ్యులు, పాల్గొన్నారు.

‘యువ వికాసం’ సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి టౌన్‌: రాజీవ్‌ యువ వికాసం పథకంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని బీసీ, గిరిజన విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, వినోద్‌నాయక్‌కు గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇతర పథకాల్లో లబ్ధి పొందని వారు దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అనర్హుడిగా గుర్తిస్తూ తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపారు. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారన్నారు. తక్షణమే సమస్యను పరిస్కరించాలని కోరారు.

పాఠశాలలో

సమగ్ర శిక్ష కార్యక్రమం

బీబీపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం సమగ్ర శిక్ష ట్విన్నింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల సముదాయంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉప్పర్‌ పల్లి, ఇస్సానగర్‌ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. మండల విద్యాధికారి అశోక్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రారెడ్డి, యూపీఎస్‌ పాఠశాలల హెచ్‌ఎంలు రాఘవరెడ్డి, పద్మిని, పాఠశాల ఉపాధ్యాయులు విశ్వమోహన్‌, రాము,అరుంధతి, స్వామి, నాగరాజు, నవీన్‌ కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

రసవత్తరంగా కుస్తీ పోటీలు 1
1/2

రసవత్తరంగా కుస్తీ పోటీలు

రసవత్తరంగా కుస్తీ పోటీలు 2
2/2

రసవత్తరంగా కుస్తీ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement