
భాగ్యరెడ్డి వర్మకు ఘన నివాళి
కామారెడ్డి క్రైం: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ జన్మదిన వేడుకలను కలెక్టరేట్‌లో, జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళితులు, బడుగు వర్గాల హక్కుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలను కలెక్టర్, ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారిణి రమ్య, అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.