
ఏటీసీ సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన
ఎల్లారెడ్డి పట్టణ శివారులో టాటా సంస్థ సహకారంతో రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఏటీసీ (అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ) నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్థ సంయుక్త నిర్వహణలో ఎల్లారెడ్డిలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో టాటా సంస్థ సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. నియోజకవర్గంలో ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ,ఉపాధి కల్పనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తాను చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఏటీసీ కేంద్రం మంజూరు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు.