
కూలిన ఇళ్ల పరిశీలన
భిక్కనూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు మండల కేంద్రంలో రెండు నివాసపు ఇళ్లు గురువారం కూలిపోయాయి. మండల కేంద్రానికి చెందిన పోచమ్మ, బసగళ్ల ఎల్లయ్య నివాసం ఉంటున్నా ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈవిషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు, వెంటనే మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆస్తి నష్టం అంచనా వేసి పంచనామా నిర్వహించారు.