వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

Published Sun, Mar 23 2025 9:08 AM | Last Updated on Sun, Mar 23 2025 9:04 AM

బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్‌–పోచంపాడ్‌ గ్రామాల మధ్యగల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరా లు ఇలా.. ౖభైంసా మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ గజారం(32) మూడేళ్ల క్రితం కూలీ పనుల కోసం మెండోరా మండల కేంద్రానికి వచ్చాడు. ఈక్రమంలో శనివారం ఉదయం బుస్సాపూర్‌ నుంచి పోచంపాడ్‌ వైపు జాతీయ రహదారి 44పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు మెండోరా ఎస్సై నారాయణ పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరు..

వేల్పూర్‌: మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై సంజీవ్‌ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రకు చెందిన శంకర్‌(32) కూలీ పని కోసం కొన్ని నెలల పచ్చలనడ్కుడకి వచ్చాడు. మహారాష్ట్రకు చెందిన బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో నివాసముంటూ గ్రామంలో కూలీ పనులు చేసేవారు. గురువారం రాత్రి ఇద్దరు గొడవ పడగా చుట్టుపక్కల వారు సర్ధిచెప్పారు. శనివారం ఉదయం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి ఇంట్లో చూడగా శంకర్‌ మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. మరో వ్యక్తి బాలాజీ లేకపోవడం, మృతుడి వివరాలు తెలిపేందుకు ఎవరూ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి సందర్శించారు.

చేపల వేటకు వెళ్లి..

మోపాల్‌: మండలంలోని మంచిప్ప గ్రామంలో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా.. మంచిప్ప గ్రామానికి చెందిన సుంకరి సాయిలు (55), దండ్ల శ్రీను శుక్రవారం సాయంత్రం గ్రామంలోని కొండెం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. సాయిలు చెరువులోకి దిగగా, శ్రీను కట్టపై ఉన్నాడు. చెరువులోకి దిగిన సాయిలు బురదలో కూరుకుపోయి ఊపిరాడక మునిగిపోయాడు. విషయాన్ని శ్రీను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిలు కోసం గాలించగా, శనివారం మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

సాగర్‌ కాలువలో పడి..

రుద్రూర్‌: మండలంలోని రాయకూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సాగర్‌ కాలువలో పడి మృతిచెందాడు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా.. రాయకూర్‌ గ్రామానికి చెందిన మాగిరి సుభాష్‌ (40)కు గతంలో యాక్సిడెంట్‌ కావడం వల్ల కాలు విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈనెల 19న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సుభాష్‌ తిరిగి రాలేదు. 21న రాత్రి సులేమాన్‌ నగర్‌ శివారులోని సాగర్‌ కాలువలో అతడి మృతదేహం లభ్యమైంది. సుభాష్‌ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా, ఫిట్స్‌ రావడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి తండ్రి సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి 1
1/2

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి 2
2/2

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement