మద్నూర్(జుక్కల్): నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల్లో తప్పులు లేకుండా సజావుగా చేయాలని జుక్కల్ నియోజికవర్గ ఓటరు నమోదు అధికారి, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఎనిమిది మండలాల తహసీల్దార్‌లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ లింక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆయా మండలాల్లో 80 శాతానికి పైగా ఆధార్ లింక్ జరిగిందని, మిగిలిన వారిని లింక్ చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్‌లు ముజీబ్, భిక్షపతి, దశరథ్, సవాయిసింగ్, మహెందర్‌కుమార్, డిప్యూటి తహసీల్దార్‌లు శరత్‌కుమార్, శివరామక్రిష్ణ, ఆర్‌ఐ శంకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలుషిండే, కృష్ణపటేల్, హన్మండ్లు, రోహిదాస్, హన్మాండ్లు పాల్గొన్నారు.