ఆశాల సమస్యలను పరిష్కరించాలి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఆశా కార్యకర్తలతో కలిసి బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటిగౌడ్ మాట్లాడుతూ.. ఆశాలకు రూ. 18వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. న్యాయమైన సమస్యలను చెప్పుకుందామంటే జిల్లాలో ఆశలను ఎక్కడికక్కడ, రాత్రి పూట అరెస్టు చేయడం సరికాదన్నారు. అనంతరం ధర్నా స్థలానికి వచ్చిన డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మెతిరాం నాయక్, కోత్త నర్సింలు, ముదాం అరుణ్, రాజశ్రీ, మమత, భాగ్యలక్ష్మి, లత తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు..
కామారెడ్డి టౌన్/తాడ్వాయి: కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందుస్తుగా కొందరు ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లకు తరలించారు. మరికొందరు జిల్లా కేంద్రానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.
శిథిలావస్థలో వాటర్ ట్యాంక్