నస్రుల్లాబాద్(బాన్సువాడ)/దోమకొండ: విద్యార్థి దశలోనే విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నెమ్లి గ్రామంలో మంగళవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ఆమె పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. విద్యార్థుల నృత్యాలను చూసి అభినందించారు.
ఆమె వెంట డీఈవో రాజు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బాల్‌రాజు, ఎంఈవో చందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దోమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంఈవో విజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.
పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
బాన్సువాడ రూరల్/లింగంపేట/ఎల్లారెడ్డిరూరల్/నాగిరెడ్డిపేట/సదాశివనగర్/మద్నూర్ : బాన్సువాడ మండలం కోనాపూర్ జెడ్పీహైస్కూల్‌లో, ఎల్లారెడ్డి మండలం కళ్యాణి జెడ్పీ పాఠశాలలో, నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద హైస్కూల్‌లో, సదాశివనగర్ మండలం ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. మద్నూర్‌లోని బాలుర గురుకుల పాఠశాల, కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. లింగంపేట మండలం పొల్కంపేట బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో, ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి కింది తరగతుల విద్యార్థులకు విద్యా బోధన చేశారు.
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి