
భిక్కనూరులో నేలకూలిన వేప చెట్టు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. దోమకొండ, బీబీపేట, తాడ్వాయి, రాజంపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి, మద్నూర్, నిజాంసాగర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, రామారెడ్డి, మాచారెడ్డి తదితర మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల రోడ్డు పక్కన చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో మామిడి కాయలు నేలరాలాయి. వరికంకులు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. భూగర్భజల మట్టం పడిపోయి బోర్లు ఎత్తిపోతుండడంతో పంటలకు నీరందక ఎండిపోతున్న పరిస్థితుల్లో అకాల వర్షం కొంత ఊరటనిచ్చినా.. వడగళ్లతో నష్టం జరిగింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనం కాస్త తెరిపినపడ్డారు.

హజ్గుల్‌లో కురిసిన వడగండ్లు

మద్నూర్‌లో కురుస్తున్న వడగండ్ల వాన