
కృష్ణాజీవాడి శివారులో..
● చేను వద్దే ఆవాసం ● పనులు చూసుకోవడం సులువైందంటున్న రైతులు
జిల్లాలో చాలామంది రైతులు పొలాల వద్ద ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్ల వెంట భూములు ఉన్న రైతులు.. అక్కడే ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. కామారెడ్డి, తాడ్వా యి, రాజంపేట, గాంధారి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాల్లో రైతుల ఇళ్లు కనిపిస్తాయి. గతంలో ఊళ్లో ఇల్లు ఉంటే.. పొలం దూరాన ఉండేది. అక్కడికి వెళ్లి పనులు చూసుకుని సూర్యాస్తమయ సమయానికి ఇల్లు చేరుకునేవారు. రాత్రి వేళలో పంటలకు కాపాలాకు వెళ్లేవారు పొలాల వద్ద మంచెలు ఏర్పాటు చేసుకునేవారు. పశువుల కోసం కొట్టాలుండేవి. కొందరు పొలంలోనే ఇల్లు కుట్టుకున్నా.. ఊరికి దూరంగా ఇల్లు ఉండడంతో దొంగల భయం ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దొంగల భయం తగ్గడంతో పొలాల వద్ద ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
