
‘ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’
పత్రికలు, వాటిలో పనిచేసే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయ్యినా ఇప్పటికీ బ్రిటీష్ పాలన మాదిరిగా పత్రికలపై దాడులకు దిగడం నీతి బాహ్యమైన చర్యే. విజయవాడ, హైదరాబాద్ సాక్షి కార్యాలయంలోకి పోలీసులు వెళ్లడం ద్వారా పత్రిక రోజువారీ దినచర్యలకు ఆటంకం కలిగించడం సహేతుకం కాదు. పత్రికల స్వేచ్చకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే...
– రెడ్డిపల్లి రాజేష్, అధ్యక్షుడు,
సిటీ ప్రెస్‌క్లబ్,కాకినాడ
రాజకీయ కక్షలు కార్పణ్యాలతోనే...
రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ విూడియా సంస్థపై దాడికి దిగడం సరైన విధానం కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోకూడదు. అదికూడా సమయం సందర్భం లేకుండా తరచు సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, కార్యాలయంలో పోలీసుల హల్‌చల్, సంపాదకుడు ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రజాస్వామ్యవాదులు ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిందే.
– నదీముల్లాఖాన్ దురాని, మాజీ ఉపాధ్యక్షుడు
ఏపీడబ్ల్యూజే, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా

‘ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’