
ఏటా సంప్రోక్షణ, శాంతి హోమం తప్పనిసరి
అన్నవరం దేవస్థానంలో తెలిసో తెలియకో జరిగే అపచారాల వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు ఏటా సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేయాలి. ప్రకృతి ప్రకోపం వలన ఏర్పడే తుఫాన్లు, సునామీ, కరోనా తదితర సమయాలలో ఎదురయ్యే దుష్పరిణామాలు ఈ వైదిక కార్యక్రమాల వల్ల సమసిపోతాయి.
– బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి
సోమయాజి, త్రివేది, దేవస్థానం
విశ్రాంత వేదపండితుడు, వైదిక సలహాదారు