బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన పదో తరగతి బయలాజికల్ సైన్స్ పరీక్షకు 28,280 మంది హాజరయ్యారు. 338 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ 5, తనిఖీ అధికారులు 40 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, ఓపెన్ స్కూల్ టెన్త్ విద్యార్థులకు సోషల్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. వీటికి 2,024 మంది హాజరవగా 192 మంది గైర్హాజరయ్యారు.
సోషల్ పరీక్ష తేదీ మార్పు
రంజాన్ పర్వదినం కారణంగా ఈ నెల 31వ తేదీన నిర్వహించాల్సిన సోషల్ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. దీనిపై విద్యార్థులకు పాఠశాలల యాజ మాన్యాలు సమాచారం అందించాలని సూచించారు.
ఉద్యోగ ప్రకటన రద్దు
కాకినాడ క్రైం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గత ఏడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ నంబర్ 01/2024తో ఇచ్చిన ఉద్యోగ ప్రకటనను రద్దు చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ నరసింహ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 (3 పోస్టులు), ఎఫ్‌ఎన్‌ఓ (20 పోస్టులు), శానిటరీ అటెండర్ కం వాచ్‌మన్ (38 పోస్టులు) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బ్యాంక్ డీడీలను ఉన్నతాధికారుల ఆదేశాల తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. కాకినాడలోని తమ కార్యాలయంలో ఏప్రిల్ 24వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య డీడీలు వాపసు ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ కాపీ ఇచ్చి, దరఖాస్తు సంఖ్య చెప్పి, డీడీలు వెనక్కి తీసుకోవాలని కోరారు. జీఓ నంబర్ 32 ప్రకారం ప్రతి పీహెచ్‌సీకి 14 మంది మాత్రమే సిబ్బంది ఉండాలన్న నిబంధన, కొన్ని క్యాడర్ ఉద్యోగాల విలీనం కారణంగా రేషనలైజేషన్‌లో పోస్టులు అదనంగా గుర్తించడంతో కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ రద్దుకు నిర్ణయం తీసుకున్నామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
అమలేశ్వరికి వెండి
ఆభరణాల సమర్పణ
అమలాపురం రూరల్: మండలం రోళ్లపాలెంలో కొలువైన అమలేశ్వరీ సమేత అమలేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి భక్తులు వెండి ఆభరణాలను సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సూమారు రెండులక్షలతో తయారు చేసిన కిరీటం, దండ, హారం, ముక్కపుడక, కళ్లు, కనుబొమ్మలు తదితరులు ఆభరణాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాటిని అమ్మవారికి అలకరించారు. హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమాధనఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తాళ్లమ్మకు వెండి, పంచ
లోహ పాదాల సమర్పణ
ఆలయ అభివృద్ధికి రూ.4.4 లక్షల విరాళం
కొత్తపేట: స్థానిక కమ్మిరెడ్డిపాలెం గ్రామ దేవత తాళ్లమ్మ తల్లికి భక్తులు వివిద రూపాల్లో వితరణలు చేశారు. కొండేపూడి గోవిందరాజు, వీర వెంకట అనంతలక్ష్మి దంపతుల కుమారుడు వీరమణికంఠ రూ.2.04 లక్షలతో వెండి, పంచలోహ పాదములు, గరగను చేయించి శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు మిద్దే సత్యనారాయణ ద్వారా ఆలయానికి సమర్పించారు. వాటిని ఆలయ ఆసాదు అమ్మవారికి అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఏఎస్‌ఐ ఏడిద సత్యనారాయణమూర్తి అమ్మవారి అలంకరణకు ఆభరణాలు, ఆలయ అభవృద్ధి నిమిత్తం రూ.1.3 లక్షలు, దెందులూరి వీరభద్రం – భానుతిలకం (మాజీ ఎమ్మెల్యే) దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు, ఎస్‌బీఐ విశ్రాంత ఏజీఎం దెందులూరి జగదీశ్వరప్రసాద్ రూ.1.1 లక్షలు, మిద్దే సావిత్రమ్మ, బలరామమూర్తి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు మిద్దే సత్యనారాయణ (ఆలయ కమిటీ ప్రెసిడెంట్), ఆదినారాయణ, శ్రీనివాస్, శ్రీహరి సోదరులు కలిసి రూ.1,00,116, పట్టపు పద్మావతి – తాతారావు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రూ.1,00,116, విరాళంగా అందచేశారు.
టెన్త్ పరీక్షకు 28,280 మంది హాజరు


