
తనిఖీ చేస్తున్న వ్యవసాయశాఖాధికారులు
కాకినాడ రూరల్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు సంబంధించి సీ్త్ర, పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్రాజ్ సీఈఓ షేక్ ఇమ్రాన్ తెలిపారు. సైన్స్ విభాగాల ఉద్యోగాలకు ఎంపీసీలో 50 శాతం మార్కులతో పాటు మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటో మొబైల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇనుస్ట్రూమెంటేషన్) 50 శాతం మార్కులు, ఒకేషనల్ రెండేళ్ల కోర్సులో 50 శాతం మార్కులు సాధించాలని, ఇంగ్లిషులో 50 ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు 2002 డిసెంబరు 26 నుంచి 2006 జూన్ 26 మధ్య జన్మించాలని అన్నారు. సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్ట్స్‌లో ఇంటర్ 50 శాతం మార్కులతో ఇంగ్లిషులో 50 ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులన్నారు. ఈ ఏడాది మే 20న ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఉంటుందని, ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. దరఖాస్తు చేసుకోవాల్సిన ఆన్‌లైన్ అడ్రాస్: httpr://af nipathvayu.cdac.in
నిషేధిత పురుగు
మందులు స్వాధీనం
పిఠాపురం: అనుమతులు లేకుండా నిల్వ చేసిన నిషేధిత పురుగు మందులను గొల్లప్రోలులో అధికారులు పట్టుకున్నారు. రూ. 4.69 లక్షల విలువైన 46 రకాల పురుగు మందులు సీజ్ చేశారు. సంబంధిత యజమానిపై కేసు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గొల్లప్రోలు పాపయ్య చావిడికి చెందిన పేకేటి తమ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో భారీగా నిషేధిత పురుగు మందుల ఉన్నట్లు సమాచారం వచ్చింది. పిఠాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ స్వాతి ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు. భారీ ఎత్తున పురుగు మందులు గుర్తించారు. ఇందులో కాలం చెల్లిన..అనుమతి లేని గైసిల్ వంటి పురుగు మందులు కూడా ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బాధ్యుడైన ఇంటి యజమాని తమ్మయ్యపై కేసు పెట్టనున్నట్లు పిఠాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ స్వాతి తెలిపారు. దాడుల్లో గొల్లప్రోలు వ్యవసాయ శాఖాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
కాకినాడ క్రైం: తుని టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసి బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ పి.బాలవర్ధిరాజు కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్స్‌తో సహా పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పెద్దాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది తమ వంతు సాయంగా రూ.4.07 లక్షల మొత్తాన్ని సమకూర్చారు. సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చేతుల మీదుగా బాలవర్ధిరాజు కుటుంబానికి ఆ సొమ్ము అందజేశారు. ఈ సాయం మొత్తాన్ని చెక్కు రూపంలో మృతుడి భార్య లక్ష్మికి ఇచ్చారు. బాలవర్ధిరాజుది కోటనందూరు మండలం పాతకొట్టాం గ్రామ పంచాయతీ సంగవాక గ్రామం. గత ఏడాది నవంబర్ 16న పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అతను అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, అపస్మారక స్థితిలోకి వెళ్లి డిసెంబర్ 23న కాకినాడలో మృతిచెందారు. జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్, పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.మురళీమోహన్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి చర్యలు
కాకినాడ సిటీ: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారితా అధికారి కె.ప్రవీణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని అన్నారు. అర్హులైన అభ్యర్థినులు సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 31లోగా ఆయా ప్రాజెక్టు కార్యాలయాల్లో అందజేయాలని వివరించారు.

బాలవర్ధిరాజు పిల్లలను ఆప్యాయంగా పలుకరిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు