
కిర్లంపూడి: అస్సాంలో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించే ఏషియన్ ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలకు కిర్లంపూడికి చెందిన కర్రి శ్రీనివాసరావు చీఫ్ రిఫరీగా ఎంపికయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి కె.పట్టాభిరామ్ ఈ విషయం తెలిపారు. శ్రీనివాసరావు కిర్లంపూడి యంగ్‌మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ పూర్వ క్రీడాకారుడు కూడా. ఆయనను క్లబ్ అధ్యక్షుడు పెంటకోట నాగబాబు, తూర్పు గోదావరి జిల్లా ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడు చదలవాడ బాబి, సర్పంచ్ మహేంద్రాడ శ్రీలత తదితరులు అభినందించారు.