కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి (ఆర్‌ఐఓ) ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జరిగిన సెకండియర్ ఇంగ్లిషు పరీక్షకు జనరల్ విభాగంలో 40,364 మందికి గాను 39,119 మంది విద్యార్థులు హాజరయ్యారని, 1,245 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 4,638 మందికి గాను 4,384 మంది హాజరయ్యారని, 254 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.