బీచుపల్లి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

బీచుపల్లి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

Oct 31 2025 8:36 AM | Updated on Oct 31 2025 8:36 AM

బీచుప

బీచుపల్లి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని గురువారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్‌గౌడ్‌ శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం

గద్వాల: లోయర్‌ జూరాల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోని కృష్ణమ్మ వరదలతో ముంపునకు గురైన రేకులపల్లి గ్రామం సమీపంలొని జెన్‌ కో దగ్గర 67 ఎకరాల భూములు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. 25 మంది లబ్ధిదారులకు రూ.1.36 కోట్లు నష్ట పరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి డైరెక్టర్‌ సుభాన్‌. మాజీ జడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, ప్రతాప్‌ గౌడు పాల్గొన్నారు.

నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలి

ఉండవెల్లి: ప్రతి పాఠశాలలలో కొత్త మెనూ తప్పక పాటించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓకు, హెచ్‌ఎంలకు సూచించారు. గురువారం మండల కేంద్రం, బొంకూరు పాఠశాలలను డీఈఓ పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రికార్డులను, కొనసాగుతున్న పరీక్షలను, గదులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బొంకూరులోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాద్‌, ప్రధానోపాద్యాయులు హేమలత, మద్దిలేటి తదితర్లు పాల్గోన్నారు.

నేటి ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ని జయప్రదం చేయాలి

గద్వాల: కేంద్ర యువజన శాఖ పిలుపు మేరకు శుక్రవారం గద్వాల పట్టణంలోని ఎంఎల్‌డీ కాలేజ్‌ నుంచి రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కాలేజీ నుంచి ప్రారంభమయ్యే దానికి యువతీ, యువకులు అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్రాములు, రవికుమార్‌, అక్కల రమాసాయి, వెంకటేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

రేపు ఎస్‌జీఎఫ్‌ జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

గద్వాలటౌన్‌: ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నవంబరు 1వ తేదీన జిల్లాస్థాయి అండర్‌–17 బాల, బాలికల కబడ్డీ పోటీలతో పాటు సెలక్షన్స్‌ నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ కృష్ణయ్య తెలిపారు. రాయచూరు రోడ్డులోని రింగ్‌రోడ్డు చౌరస్తాలో ఉన్న ఆర్యన్స్‌ విశ్వసూర్య స్కూల్‌లో పోటీలు ఉంటాయని, పోటీలకు హాజరయ్యే విద్యార్థులు బోనోఫైడ్‌, ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌ తమ వెంట తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ నం.9440232894కు సంప్రదించాలని తెలిపారు.

వేరుశనగ క్వింటా రూ.5,306

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌ యార్డుకు గురువారం 144 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5306, కనిష్టం రూ.3016, సరాసరి రూ.4010 ధరలు లభించాయి. అలాగే, 38 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5890 ధర పలికింది.

బీచుపల్లి ఆలయంలో  ఎంపీ ప్రత్యేక పూజలు  
1
1/2

బీచుపల్లి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

బీచుపల్లి ఆలయంలో  ఎంపీ ప్రత్యేక పూజలు  
2
2/2

బీచుపల్లి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement