 
															కేజీబీవీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల కేజీబీవీని అలంపూర్ జడ్జి మిథున్ తేజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం కస్తూర్బా పాఠశాల మూత్రశాలలను, గదులు, వంట గదిని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని, సామాజిక విలువలపై అవగాహన పెంపొందించాలని ప్రిన్సిపల్ పరిమళ, ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, ఇతరులను అనుమతించే సమయంలో తప్పనిసరిగా వారి ఐడీ కార్డులను పరిశీలించాలని, విద్యార్థినుల భద్రతే ప్రదానమన్నారు. కార్యక్రమంలో సీవిల్ కోర్టు న్యాయవాదులు, సిబ్బంది, పోలీసులు, ఉపాద్యాయులు పాల్గోన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
