 
															నర్సింగ్ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
గద్వాల: రూ.33.02 కోట్ట నిధులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్పరెన్స్ హల్లో నర్సింగ్ కళాశాలతో పాటు మెడికల్ కళాశాల విద్యార్ధుల వసతిగృహ ఏర్పాట్లు పనులు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా నర్సింగ్ కళాశాల వసతి గృహ భవనాల ప్రారంభోత్సవంతో పాటు రూ.130 కోట్ల నిధుల అంచనాతో మెడికల్ కళాశాల వసతిగృహ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థినులు ఉండే వసతి గృహంలో అవసరమైన మౌలిక వసతులు ఏమైనా ఉంటే వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. మెడికల్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీర్ వేణుగోపాల్, శ్రీనివాసులు, రహీం, తదిలరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
