 
															భూభారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఇటిక్యాల: భూభారతితోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ట్రైయినీ కలెక్టర్ మనోజ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. భూ భారతిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కొనసాగుతున్న ఎస్‌ఎ పరీక్షతోపాటు తరగతి గదులు, వంట రూం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
