వైభవంగా పాగుంటస్వామి బ్రహ్మోత్సవాలు
కేటీదొడ్డి: వమండలంలోని వెంకటాపురంలో వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ప్రత్యేక పూజలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. సంప్రదాయ బద్ధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా జరిపారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణల మధ్య ప్రభోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి దాసంగాలతో పాటు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, శ్రీధర్, రాజశేఖర్, రామకృష్ణనాయుడు, ఉరుకుందు, వెంకన్‌గౌడు, గోపి, నవీన్ పాల్గొన్నారు.
వైభవంగా పాగుంటస్వామి బ్రహ్మోత్సవాలు


