
టీ–గేట్ కమిటీ జిల్లా చైర్మన్‌గా మహేష్‌కుమార్
గద్వాల: తెలంగాణ గేట్‌వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ కమిటీ జిల్లా చైర్మన్‌గా మహేష్‌కుమార్ నియమితులైనట్లు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు మహేష్‌కుమార్‌కు నియామక ప్రతిని అందజేశారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఎస్‌వీవీ సత్యనారాయణ, కమిటీ సభ్యులుగా ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి డాక్టర్ ప్రియాంక, ఐటీఐ ట్రైనింగ్ అధికారి మహ్మాద్ కలీమ్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు కమిటీ పనిచేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు.