
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం
గద్వాలటౌన్: వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని, పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకుసాగాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యశాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలాల వారీగా కార్యశాలలు నిర్వహించి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్దం కావాలని దిశానిర్ధేశం చేశారు. ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోరతూ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోని ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికలలో జిల్లాలోని 13 మండలాలలో పది మండాలలో బీజేపీ మెజార్టీ సాధించిందని చెప్పారు. ఈసారి అదే స్ఫూర్తితో జిల్లా పరిషత్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అర్హులందరకీ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామంజనేయులు, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, జయశ్రీ, శివారెడ్డి, రాజగోపాల్, వెంకటేశ్వర్‌రెడ్డి, దేవదాసు, మాలీం ఇసాక్, అనిల్, చిత్తారికిరణ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.