
స్వచ్ఛతలో వెనుకడుగే..!
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల విడుదల
●
గద్వాల టౌన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గత ఏడేళ్లుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలను నిర్వహిస్తోంది. పరిశుభ్ర పట్టణాలే దీని లక్ష్యం. మొదటి నుంచి జిల్లాలోని గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పోటీని ఎదుర్కొంటున్నాయి. గత రెండేళ్ల నుంచి అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు పోటీలో ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నిర్ధేశిత అంశాల్లో ప్రాధాన్యం కల్పించే స్వచ్ఛత కార్యక్రమాలపై అధికారుల్లో ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఏటికేడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మార్పులు లేకపోవడంతో దాని ప్రభావం రాష్ట్ర, జాతీయ స్థాయి ర్యాంకులపై పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ర్యాంకులో పూర్తిగా దిగజారిపోయింది. స్వచ్ఛ ప్రమాణాల ఆధారంగా 2024–25 ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసింది.
ఈ ఏడాది మంచి ర్యాంకు సాధిస్తాం
పారిశుద్ధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నాం. డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రక్రియకు, ఎరువుల తయారీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో అధికమిస్తాం. కేంద్ర కార్యక్రమాలు విధిగా చేపట్టి, వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శనతో మంచి స్థానం సాధిస్తాం.
– దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
కనీస పురోగతి లేని మున్సిపాలిటీలు
తూతూ మంత్రంగా పారిశుద్ధ్య నిర్వహణ
బోర్డులకే పరిమితమైన చెత్త రహిత రహదారులు

స్వచ్ఛతలో వెనుకడుగే..!

స్వచ్ఛతలో వెనుకడుగే..!