
జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు నిధులు
నిధుల మంజూరు ఇలా..
కళాశాల నిధులు (రూ.లలో)
గద్వాల 12.5 లక్షలు
ధరూర్ 11.5 లక్షలు
అలంపూర్ 11.5 లక్షలు
గట్టు 10.1 లక్షలు
మానవపాడు 15 లక్షలు
మల్దకల్ 15 లక్షలు
అయిజ 14.5 లక్షలు
గద్వాలటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి సర్కారు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు భవనాల మరమ్మతు, బోధనకు వీలుగా సౌకర్యాల కల్పనకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా కళాశాలల్లో గుర్తించిన అవసరాలను తీర్చేందుకు నిధులు మంజూరు చూసింది. జిల్లాలో మొత్తం ఎనిమిది జూనియర్ కళాశాలలు ఉండగా.. ఏడు కళాశాలలకు రూ. 90.1 లక్షలు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కళాశాల భవనాలకు రంగులు వేయడం, విద్యుత్ మరమ్మతు, నీటి సౌకర్యం, గ్రీన్ బోర్డు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. కలెక్టర్ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని డీఐఈఓ హృదయరాజు తెలిపారు.

జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు నిధులు