
‘సమాలోచన సదస్సు’ను జయప్రదం చేయాలి
ఎర్రవల్లి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నో రంగాల్లో శాశ్వత వెనుకబాటుతనాన్ని కలిగి ఉందని దీనిపై సమాలోచన చేసేందుకు గాను జులై 5న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సును జయప్రదం చేయాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఇక్బాల్ పాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు రెండు పార్లమెంట్, 14 శాసనసభ స్థానాలతో ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాను నేడు అద్దాన్ని పగలకొట్టినట్లు ఏడు జిల్లాలోకి చెదరగొట్టిన ప్రాంతంగా మిగిలిందన్నారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా ప్రజలకు త్రాగునీరు, పంటలకు సాగునీరు సక్రమంగా అందడంలేదన్నారు. ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి మధ్యలోనే వదిలేశాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పాలమూరు ఎన్నో రంగాల్లో పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య వి/్ఞానకేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్ నందు ఏర్పాటు చేసిన సమాలోచన సదస్సుకు కవులు, మేధావులు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై పాలమూరు సమస్యలపై చర్చించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పాలమూరులో నెలకొన్న పలు సమస్యలకు సంభందించిన వాల్ పోస్టర్లను స్థానిక నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోకన్వీనర్ హనుమంతు, జేఏసీ చైర్మన్ రాగన్న, రాగన్న, కృష్ణ, శాంతన్న, నాగన్న, తదితరులు పాల్గొన్నారు.