
యాసంగి నాటికి ‘చిన్నోనిపల్లి’ పూర్తిచేయండి
అలంపూర్: రాబోయే యాసంగి సీజన్ నాటికి చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్, ఎత్తిపోతల పథకాల పనుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. యాసంగి సీజన్ నాటికి చిన్నోనిపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా సాగు నీరు అందించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. అలంపూర్ మండలంలోని బుక్కాపురం ఎత్తిపోతల పథకానికి కొత్త మోటార్లు, పంపుసెట్లు ఇవ్వాలని, ఊట్కూరు– 1, క్యాతూరు, గుందిమల్ల, అలంపూర్ లలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ చేసి రబీ సీజన్‌కు మోటార్లను అందుబాటులో ఉంచాలని కోరారు. వీరితోపాటు నాయకులు అశోక్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రఘు రెడ్డి తదితరులు ఉన్నారు.