డయాలసిస్ రోగులు జాగ్రత్తలు పాటించాలి
అలంపూర్: డయాలసీస్ రోగులు ఆహారపు ఆలవాట్లలో జాగ్రత్తలు పాటించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ పాష అన్నారు. బుధవారం అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అపెక్స్ డయాలిసిస్ సెంటర్‌లో అధ్వర్యంలో పేషెంట్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. డయాలిసిస్ రోగులు క్రమం తప్పకుండా వారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాలని, బీపీ, షుగర్, కిడ్నీ సంబందించిన మందులు వాడాలన్నారు. కావాల్సిన ఇంజెక్షన్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతామన్నారు. డయాలసిస్ సెంటర్ ఇన్‌చార్జ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కిడ్నీ సంబందిత రోగులు అధిక సంఖ్యలో డయాలసిస్ మీదకి వస్తున్నారని, అందుకు గల కారణాలను వివరించారు. కిడ్నీ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.


