
ప్రోత్సాహం
ఉద్యాన పంటలకు
అయిజ: రైతులను ఉద్యాన పంటల సాగువైపు మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పంటల సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అవగాహన సదస్సులు ఇదివరకే నిర్వహించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకాలను అమలు చేస్తోంది. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీని అందించి రైతులను ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టింది. సబ్సిడీని మూడు విడతలుగా రైతులకు అందించనుంది. ప్రభుత్వం ఈ యేడాది (2025–26 ఆర్థిక సంవత్సర) 252 యూనిట్లు మంజూరు చేసింది. దానికోసం రూ.1,07,86,000 నిధులు మంజూరు చేసింది. ఇదిలాఉండగా, ఉద్యాన పంటలను తక్కువ నీటితో సాగుచేయవచ్చు. అదేవిధంగా ఈ పంటల సాగుకు కొంత పెట్టుబడి పెడితే నిత్యం లాభాలు ఆర్జించవచ్చు. దీంతో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాకు మంజూరైన యూనిట్ల వివరాలిలా..
పంట యూనిట్లు యూనిట్ రాయితీ
ధర (రూ.లక్షల్లో)
బత్తాయి 110 52.80 2.00
మామిడి 40 19.20 2.00
డ్రాగన్ ఫ్రూట్ 10 16,20,000 6.75
బొప్పాయి 25 4,50,000 75 వేలు
జామ 6 2,88,000 2.00
దానిమ్మ 5 2,40,000 2.00
కోకో 20 2,40,000 50 వేలు
అవకాడో 5 1,50,000 1.25
సీతాఫలం 5 90,000 75 వేలు
ఉసిరి 3 54,000 75 వేలు
నేరేడు 3 54,000 75 వేలు
పూల తోటలు 20 4,00,000 50 వేలు
బి.తిమ్మాపూర్ శివారులో సాగుచేసిన నిమ్మతోట
ఎంఐడీహెచ్ నుంచి చేయూత
సాగుకు మొగ్గుచూపుతున్న రైతులు
జిల్లాకు 141 యూనిట్లు..
రూ.1.07 కోట్లు మంజూరు

ప్రోత్సాహం

ప్రోత్సాహం