
పత్తి సాగుకు సన్నద్ధం
●
8 ఎకరాల్లో సాగు..
గతేడాది క్వింటాల్ పత్తి రూ. 7,500 పైగా ధర పలికింది. ఈఏడాది కూడా మంచి దిగుబడి, ధర వస్తుందన్న ఆశతో 8 ఎకరాల్లో పంటసాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసు కోవాలి. – రవికుమార్, రైతు, చెన్నిపాడు
మంచి దిగుబడి వస్తుందని..
గత సీజన్‌లో పత్తిని సాగుచేయగా.. ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట వస్తుందనే ఆశతో ఈసారి 15 ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నా. వరుణదేవుడు కరుణించాలి.
– గొల్ల వెంకట్రాములు, రైతు, మానవపాడు
నకిలీ విత్తనాలను
అరికడుతున్నాం..
జిల్లాలో నకిలీ విత్తనాలను అరికడుతున్నాం. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్ మార్కెట్‌లో పత్తి విత్తనాలు అమ్మితే మా దృష్టికి తీసుకురావాలి. – సక్రియా నాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మానవపాడు: పత్తికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో పండించే పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభిస్తుండటం.. జిల్లావ్యాప్తంగా నల్ల, ఎర్రనేలలు ఉండటం.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంటున్న నేపథ్యంలో జిల్లా రైతులు పత్తిసాగుకు సై అంటున్నారు. అదే విధంగా పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశంగా రైతులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, వానాకాలం ప్రారంభానికి ముందే మోస్తరు వర్షాలు కురుస్తుండటం రైతుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది. వ్యవసాయ పొలాల్లో దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తిసాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు.
1,42,410 ఎకరాల్లో సాగు అంచనా..
గతేడాది జిల్లావ్యాప్తంగా 1,33,206 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది 1,42,410 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు సాగు ప్రణాళికలను సిద్ధం చేసింది. గతేడాది కంటే 9వేలకు పైగా ఎకరాల్లో పత్తిపంట అదనంగా సాగయ్యే అవకాశం ఉండటంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మానవపాడులోని ఫర్టిలైజర్ దుకాణంలో
తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు (ఫైల్)
జిల్లాలో పత్తిసాగు ఇలా..
జిల్లాలో ప్రధాన పంటగాతెల్లబంగారం
గతేడాది 1,33,206 ఎకరాల్లో సాగు
ఈసారి అదనంగా 9వేల ఎకరాల్లో
సాగవుతుందని అంచనా
దక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాతలు
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట..
జిల్లావ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా అరికట్టేందుకు ప్రభుత్వ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన ఈ బృందాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులను నియమించారు. జిల్లాస్థాయి బృందాల్లో ఏడీఏ, డీఎస్పీ, సీఐ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారి, డివిజన్‌స్థాయి కమిటీలో ఏడీఏ, ఎంఈఓ, మండలస్థాయి కమిటీలో ఏఓ, ఎస్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు విక్రయించే దళారులు, అక్రమాలకు పాల్పడే డీలర్లపై నిఘా ఉంచి.. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పత్తి సాగుకు సన్నద్ధం

పత్తి సాగుకు సన్నద్ధం

పత్తి సాగుకు సన్నద్ధం