ఆగని భూకబ్జాల పర్వం | - | Sakshi
Sakshi News home page

ఆగని భూకబ్జాల పర్వం

May 16 2025 12:40 AM | Updated on May 16 2025 12:40 AM

ఆగని

ఆగని భూకబ్జాల పర్వం

జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా మున్సిపల్‌ స్థలాలు కబ్జా

స్థలాలను కాపాడాలి

లేఅవుట్‌ ప్లాన్‌లో ప్రజా అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యాయి. వాటిపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశాం. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను కాడాలి. భవిష్యత్తులో ఎవరూ అందులో చోరబడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.

– పూజారి శ్రీధర్‌, గద్వాల

రక్షణ చర్యలు చేపడతాం

అధికారిక లేఅవుట్‌లోని పది శాతం స్థలాలను అమ్మడం, కోనడం నిబంధనలకు విరుద్ధం. విక్రయించిన లేఅవుట్‌ స్థలంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. వెంటనే టౌన్‌ ఫ్లానింగ్‌ అధికారులతో మార్కింగ్‌ చేసి ఆయా స్థలాలకు రక్షణ చర్యలు తీసుకుంటాం. స్థలాల కొనుగోలు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. – దశరథ్‌, కమిషనర్‌, గద్వాల

గద్వాలటౌన్‌: గద్వాల పట్టణ శివారులో వెలిసిన లేఅవుట్లలో అక్రమ దందా కొనసాగుతోంది. అప్పట్లో సామాజిక ప్రజా అవసరాల కోసం ఇచ్చిన స్థలాలు రాత్రికి రాత్రే ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. నాడు తయారు చేసిన అధికారిక లేఅవుట్‌ మ్యాప్‌లో సామాజిక స్థలాలు ప్రత్యేకంగా చూపించి ప్లాట్ల స్థలాలను విక్రయించారు. అధికారిక లేఅవుట్‌లో గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రర్‌ అయిన పది శాతం స్థలాన్ని అక్రమార్కులు ప్లాట్లుగా చేసి విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. ఈ ఉదంతాలు మున్సిపల్‌ పరిధిలో అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికి అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు.

ఊదాసీనంగా అధికారులు

అనుమతులు లేకుండా నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను అడ్డుకోవడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ స్థలంగా ఉన్న సామాజిక స్థలాలు అక్రమంగా ఇతరులకు ధారాదత్తం అవుతున్న ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక కొంతమంది రియల్టర్లు కుమ్మకై ్క ‘మాకెంత.. మీకెంత అంటూ..’ అంటూ బేరసారాలకు దిగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లేఅవుట్‌లోని పది శాతం స్థలం అన్యాక్రాతం అవుతుందని, ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తున్నారని చాలామంది మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటికే అనేక అధికారిక లేఅవుట్లలో ఉన్న సామాజిక స్థలాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి లేఅవుట్లలో విక్రయించిన పది శాతం సామాజిక స్థలానికి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

లేఅవుట్‌లోని పార్కు స్థలాలు సైతం మాయం

రూ.లక్షలు వెనకేసుకుంటున్న అక్రమార్కులు

ఆగని భూకబ్జాల పర్వం 1
1/3

ఆగని భూకబ్జాల పర్వం

ఆగని భూకబ్జాల పర్వం 2
2/3

ఆగని భూకబ్జాల పర్వం

ఆగని భూకబ్జాల పర్వం 3
3/3

ఆగని భూకబ్జాల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement