
తక్కువ పెట్టుబడితో సీడ్ డ్రిల్ విత్తు
దూరం పాటించాల్సిందే...!
రకం వరుసల మొక్కల
మధ్య (సెం.మీ.) మధ్య (సెం.మీ.)
వరి 25 15
మొక్కజొన్న 60 20
పామాయిల్ 60 20
పెసర 25 10
గోగు 25–30 15
వేరు శనగ 30 15
అలంపూర్: జిల్లాలో రైతులు ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగళి వెనుకసాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగు చేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచించారు. కూలీల సమస్యను అధికమించడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సీడ్‌డ్రిల్ యంత్రంతో సాగు పద్ధతులను ఆయన రైతులకు వివరించారు.
ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ ఉపయోగాలు..
● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్‌తో వేయవచ్చును.
● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చు.
● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది.
● పంటను బట్టి వరుసల మద్య దూరం, మొక్కల మద్య దూరం మార్చుకోవచ్చు.
● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వలన పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. పంటకు గాలి వెలుతురు బాగా తగిలి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది.
● యంత్రాలతో వరి, వేరు శనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ము శనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు.
● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి.
● చివరి దుక్కిలో రోటోవేటర్ ఉపయోగించాలి.
● పొలం చదునుగా ఉంటే పొలం అంత విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది. యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది.
పాడి–పంట
సాగు ఇలా..
సీడ్‌డ్రిల్ యంత్రములో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్‌లో ఎరువులు వేయాలి. రెండవ బాక్స్‌లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది.

తక్కువ పెట్టుబడితో సీడ్ డ్రిల్ విత్తు