
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి
భూత్పూర్: మండలంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రెండు వెర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నాసాగర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన యనమల రామ సంజీవరెడ్డి(35) జిల్లా కేంద్రంలోని ఓ గుత్తేదారు వద్ద ట్రాక్టర్‌తో పనులు చేయుటకు వచ్చాడు. పని పూర్తి చేసుకొని తిరిగి స్వగ్రామానికి గురువారం రాత్రి ట్రాక్టర్‌పై వెళ్తుండగా అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై పక్కనే ఉన్న రేలింగ్‌కు అదుపు తప్పి ఢీకొట్టాడు. దీంతో రామసంజీవరెడ్డి ట్రాక్టర్‌పై నుంచి ఎగిరిపడి ట్రాలీ టైర్ మీదపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చిన్నాన్న యనమల లక్ష్మీనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మరో పమాదంలో భూత్పూర్ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు మోటార్ సైకిల్‌ను శేరిపల్లి (బి) బస్టాప్ నుంచి భూత్పూర్ వైపుకు మలుపుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. శేరిపల్లి (బి) గ్రామానికి చెందిన కృష్ణ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్ధలంలో గాయపడిన వెంకటేశ్వర్లును 108 లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ తిరుమల రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరొకరికి తీవ్ర గాయాలు