
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అకర్శితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఈశ్వరియ విశ్వ విద్యాలయం వారు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. డీఎస్పీ మొగిలయ్య, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ, మంజుల, సీఐ శ్రీను, ఎస్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ట్రాక్టర్‌తో కరిగెట దున్నుతున్న ఓ రైతు