నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

May 4 2025 6:57 AM | Updated on May 4 2025 6:57 AM

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

గద్వాల: నీట్‌ పరీక్షకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ పరీక్షకు మొత్తం 1029మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరికి గద్వాలపట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1:30గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు, ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను అనుమతించబడదని పేర్కొన్నారు. అలాగే, కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, డిజిటల్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ వంటి పరికరాలు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని, తప్పనిసరిగా అడ్మిట్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు, సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు 9100901606 సంప్రదించవచ్చని తెలిపారు.

పటిష్ట బందోబస్తు

గద్వాల క్రైం: జిల్లాలో ఆదివారం నిర్వహించే నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీట్‌ పరీక్ష సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వివిధ ప్రాంతాల్లోంచి వచ్చే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్‌నెట్‌, జిరాక్స్‌ షాపులు మూసి వేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుంపులుగా కనిపించినా చర్యలు తప్పవన్నారు. అభ్యర్థులు కేంద్రాలకు సమయాని కంటే ముందుగా చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సిబ్బంది కళ్యాణ్‌కుమార్‌, మల్లేష్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు

హాజరుకానున్న 1,029 మంది అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement