నాగర్‌కర్నూల్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరు జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తపాలా ప్రమాద బీమా పాలసీ సేకరణ కేంద్రాలను సందర్శించారు. అంతకు ముందు తపాలా కార్యాలయం వద్ద నాగర్‌కర్నూల్ ఎంపీడీఓ కోటేశ్వర్ తపాలా బీమా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ పర్యవేక్షకుడు భూమన్న మాట్లాడుతూ కేవలం తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా పొందవచన్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ఏడాదిపాటు రూ.15 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్మికులు, ఉపాధి, అంగన్‌వాడీ, యువకులకు ఈ ప్రమాద బీమా చేయించాలని గ్రామీణ తపాలా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎం గఫార్, సిబ్బంది మహ్మద్ ఖాన్, జగన్ తదితరులు పాల్గొన్నారు.