అయిజ మున్సిపాలిటీలో ఆరుబయట చెత్త పారబోయవద్దని, ఆ పరిసరాలు అపరిశుభ్రంగా మారి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నా ప్రజలు పట్టించుకోవట్లేదు. దీంతో మున్సిపాలిటీలోని కొన్ని వార్డులో రోడ్లపై, మురుగు కాల్వల్లో చెత్త పారబోస్తున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరు 14 వాహనాల్లో ప్రతిరోజు చెత్తను ఇంటింటి నుంచి సేకరిస్తారు. కానీ, ఈ సిబ్బంది, వాహనాలు ఏమాత్రం సరిపోకపోవడంతో రోజు విడిచి రోజు చెత్త సేకరణ కొంత ఇబ్బందిగా మారింది. మూడేళ్ల క్రితం రూ.20 లక్షలతో డ్రైవేస్ట్ షెడ్, రూ.20 లక్షలతో వెట్ వేస్ట్ షెడ్‌లు నిర్మించారు. ప్రతి రోజు 12 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఇందులో 2 టన్నుల తడి చెత్తను ఎరువుగా, ఒక టన్ను పొడి చెత్తను డీఆర్‌సీసీ కేంద్రానికి తరలిస్తున్నారు. మిగిలిన 9 టన్నుల తడి, పొడి చెత్తను డీఆర్‌సీసీ కేంద్రానికి తరలిస్తున్నారు. తయారుచేసిన వర్మీ కంపోస్ట్ ఎరువును మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల్లో అవగాహన లోపం, నిర్లక్షంతో చెత్తను మురుగు కాలువల్లో గుమ్మరిస్తున్నారు.
అవగాహన లేక.. కాల్వల్లో పారబోత