
మాట్లాడుతున్న ఎంవీ రమణ
గద్వాల అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ, మండల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17 నుంచి 29వ తేదీవరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుందని, 27వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, జిల్లాలోని ప్రజలు, సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు వీవీ నర్సింహ, పరంజ్యోతి, నర్మద, గంగన్న, ఆంజనేయులు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.