మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
రేగొండ(కొత్తపల్లిగోరి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నట్లు రాష్ట్ర సీ్త్ర, శిశు, సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు ఆరు కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. మహిళలు ఆకాశంలో సగమని, పురుషులతో సమానంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రాజయ్య, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద రావు, ఏపీఎం ప్రేమ్‌రాజ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
సీ్త్ర, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ
మంత్రి సీతక్క


