
ప్రాచీన వైద్యంతో మెరుగైన జీవనం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: ప్రాచీన వైద్య పద్ధతుల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కురిమిళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధన్వంతరి వైద్య నారాయణ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై వైద్య నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు.